పోలీసులు బాధితులకు అండగా ఉండాలి: ఎస్పీ కె నరసింహ

- శాంతిభద్రతల రక్షణ, ప్రజల భద్రతలో పటిష్టంగా పని చేయాలి.
-
- నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
-
- *కేసుల దర్యాప్తులో టెక్నాలజీ సద్వినియోగం చేసుకుని పని చేయాలి.*
సూర్యాపేట క్రైమ్ అక్టోబర్ 03 (శ్రీకర ఉదయం): పోలీస్ సిబ్బందిలో పరస్పర సమన్వయం, సమయపాలన, శారీరక దారుఢ్యం (ఫిట్నెస్) పెంపొందించడం కోసమే ప్రతి శనివారం వారాంతపు పోలీసు పరేడ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కవాతు నందు ఆర్ముడ్ రిజర్వ్ పోలీసుల, సూర్యాపేట పట్టణ పీస్ సిబ్బంది, సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న పి ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి, రక్షణ లేని ఆన్లైన్ పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దు అని సూచించారు. యూనిఫాం సర్వీస్ కు ప్రజల్లో గౌరవం ఉన్నది, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేయాలి, ప్రజలు, సమాజం గమనిస్తుంది ప్రతి సేవలకు ఫీడ్ బ్యాక్ సిస్టమ్ నమోదు చేయబడుతుంది అన్నారు. ప్రజల భద్రత, రక్షణలో పటిష్టంగా పని చేయాలి, బాధితులకు అండగా ఉండాలని, కేసుల దర్యాప్తులో అందుబాటులో సాంకేతికతను సద్వినియోగం చేసుకుని పని చేయాలి అన్నారు. సిబ్బంది అందరూ అన్ని రకాల విధుల్లో ప్రావీణ్యం సాధించాలి తెలిపారు. నేరాలకు పాల్పడే వారిపట్ల, ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.విధి నిర్వహణలో గానీ, వ్యక్తిగతంగా గానీ సిబ్బందికి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఒత్తిడితో కూడిన విధుల్లో శారీరక, మానసిక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, రిజర్వ్ ఇన్స్ పెక్టర్ ప్రవీణ్ కుమార్, జానయ్య, నారాయణరాజు, సిఐ లు వెంకటయ్య, రాజశేఖర్, ఆర్ఎస్ఐలు, ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.