మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు..

మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు.. మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి.. దివంగత మాజీ మంత్రి దామోదర్ రెడ్డీ కి ఇంగ్లీష్ డేట్ ప్రకారం మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన చిత్ర పటానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ ... కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ల కుటుంబాలని ఆదుకుంటూ పార్టీ కోసం నిరంతరం పనిచేశాడనీ కొనియాడాడు. 40 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ ప్రయాణంలో ఆయన చేసిన సేవలు మరువలేవని అన్నారు...