Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

*ప్రజాసేవే దామోదర్‌రెడ్డి ఆశయం.ఆయన సేవలు చిరస్మరణీయం*

Author
Posted By SRIKHAR UDHAYAM
| 01 Oct 2026, 09:40 PM | TELANGANA
*ప్రజాసేవే దామోదర్‌రెడ్డి ఆశయం.ఆయన సేవలు చిరస్మరణీయం*

*మానవతా సేవలే దామన్నకు ఘన నివాళి*

*ప్రజాసేవే దామోదర్‌రెడ్డి ఆశయం.ఆయన సేవలు చిరస్మరణీయం*

*ప్రజాసేవే దామోదర్‌రెడ్డి ఆశయం.ఆయన సేవలు చిరస్మరణీయం* - Additional Image

సూర్యాపేట అక్టోబర్ 01 (శ్రీకర ఉదయం): దివంగత నాయకులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మానవతా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో తెలంగాణ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి నల్లేడా మాధవరెడ్డి ఆధ్వర్యంలో రోగుల బంధువులకు అల్పాహారం అందించారు.కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు మొరిశెట్టి లక్షాది, 18వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ డా. వూర రామ్మూర్తి యాదవ్, పట్టణ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు బైరు వెంకన్న గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై దామోదర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమైన దామోదర్‌రెడ్డి సేవలు, సూర్యాపేట అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్ధంతి సందర్భంగా రోగుల బంధువులకు అల్పాహారం అందించడం ద్వారా మానవతా సేవే దామోదర్‌రెడ్డికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి