Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పద్మశాలి ఎమ్మెల్సీ స్థానానికి డా. పెండెం కృష్ణకుమార్ పేరు పరిశీలించాలి*.

Author
Posted By SRIKHAR UDHAYAM
| 08 Oct 2026, 11:44 AM | Politics
పద్మశాలి ఎమ్మెల్సీ స్థానానికి డా. పెండెం కృష్ణకుమార్ పేరు పరిశీలించాలి*.

*పద్మశాలి ఎమ్మెల్సీ స్థానానికి డా. పెండెం కృష్ణకుమార్ పేరు పరిశీలించాలి*.

*మెజారిటీ పద్మశాలి వర్గాల విజ్ఞప్తి*

సూర్యాపేట అక్టోబర్ 08 (శ్రీకర ఉదయం): తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో ప్రకటించడంతో ఆ వర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సామాజిక సేవకుడు, వైద్యుడు, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు హోల్డర్‌గా ప్రచారం పొందుతున్న డా. పెండెం కృష్ణకుమార్ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పలువురు పద్మశాలీయులు కోరుతున్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి ప్రభుత్వం కల్పించనున్న ఎమ్మెల్సీ అవకాశాన్ని రాజకీయ పదవిగా కాకుండా, దీర్ఘకాలంగా సమాజ సేవ చేస్తున్న వ్యక్తికి ఇవ్వాలని ఆయన తరఫున విజ్ఞప్తి వినిపిస్తోంది.
*500 పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు*
డా. పెండెం కృష్ణకుమార్‌ తన సొంత నిధులతో 500 పాఠశాలల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని విద్యార్థుల కోసం విద్యా సామగ్రి, క్రీడా సామగ్రి, టేబుల్‌–బెంచీలు, మెడికల్‌ క్యాంపులు, స్మార్ట్‌ తరగతులు తదితర కార్యక్రమాలకు సహకరించారని,
పేద విద్యార్థులు, విద్యాసంస్థలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, చలివేంద్రాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారని,
.కోవిడ్‌ సమయంలోనూ సేవలు కరోనా మహమ్మారి సమయంలోనూ సేవా కార్యక్రమాలను కొనసాగించినట్లు,కోవిడ్‌ సమయంలో ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, వైద్య సేవల ద్వారా ప్రజలకు అండగా నిలిచినట్లు కృష్ణ కుమార్ మద్దతు దారులు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తూ మొక్కలు నాటడం, పచ్చదనం పెంపొందించడం వంటి కార్యక్రమాలు చేపట్టానని,400 పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం,
పేదలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులకు అండగా ఉన్నానని, అనాథలు, పేదలు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు, పేద విద్యార్థులకు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించడం,సమాజంలోని అవసరమైన వర్గాలకు సేవ చేయడమే లక్ష్యంగా చేసుకుని
డా. పెండెం కృష్ణకుమార్ ముందుకు సాగుతున్నారని అన్నారు.కాగా *సామాజిక సేవే నా రాజకీయ లక్ష్యం*
అనే నినాదం తాను పని చేస్తున్నానని, ఈ సేవల కారణంగానే గిన్నిస్‌ బుక్ అఫ్ వరల్డ్‌ రికార్డు హోల్డర్‌ గా కూడా తనకు సమాజంలో మంచి గుర్తింపు లభించిందని డా. పెండెం కృష్ణకుమార్ కు తెలిపారు.
2009 జూలై 9న సూర్యాపేటలో ఒకే రాత్రి తొమ్మిది వేర్వేరు థియేటర్‌ ప్రొడక్షన్స్‌లో అత్యధిక స్క్రిప్టెడ్‌ పాత్రలు పోషించిన తాను ఈ రికార్డు
నెల కొల్పానని తెలిపారు.పద్మశాలి వర్గం నుంచి మద్దతు కోరుతున్న కృష్ణ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పద్మశాలి వర్గానికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, తన సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా–వైద్య రంగాల్లో సేవలు, పర్యావరణ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్రను పరిగణనలోకి తీసుకుని తనకు అవకాశం ఇవ్వాలని పెండెం కృష్ణకుమార్ కోరుతున్నారు.ఆయన అభ్యర్థిత్వానికి పద్మశాలి సామాజిక వర్గంలోని మెజారిటీ వర్గాలు మద్దతు ఇస్తున్నాయని ఆయన అనుచరులు, మద్దతుదారులు పేర్కొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా సమాజ సేవలో కొనసాగుతున్న వ్యక్తికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే పద్మశాలి వర్గానికి మరింత గౌరవం దక్కుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అధిష్ఠానం స్థాయిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పలువురు పద్మశాలి నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు
వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో..పద్మశాలి వర్గానికి ప్రకటించిన ఎమ్మెల్సీ అవకాశంలో కేవలం రాజకీయ ప్రాతిపదిక కాకుండా, సామాజిక సేవ, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో నిరంతరం పనిచేసిన వ్యక్తుల సేవలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పెండెం కృష్ణకుమార్‌ మద్దతుదారులు కోరుతున్నారు.500 పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు.. రక్తదాన శిబిరాలు. వైద్య శిబిరాలు. అన్నదానం. చలివేంద్రాలు. కోవిడ్‌ సేవలు. పర్యావరణ పరిరక్షణ.400 పాఠశాలల్లో మొక్కల పెంపకం.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు వంటి అంశాలను తమ అభ్యర్థిత్వానికి బలమైన నేపథ్యంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించిన పద్మశాలి ఎమ్మెల్సీ అవకాశం డా. పెండెం కృష్ణకుమార్‌కు దక్కుతుందా? అన్నది పద్మశాలి వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

ఇవి కూడా చదవండి